BREAKING : అన్నమయ్యకు అవమానం.. వివాదంలో శ్రావణ భార్గవి

-

BREAKING : మరో వివాదంలో చిక్కుకుంది టాలీవుడ్‌ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి. ఒంపు సొంపుల ప్రదర్శనకు అన్నమయ్య శ్రీవారి కీర్తన అటాచ్ చేస్తూ వీడియో పెట్టింది. ఒకపరి కొకపరి వయ్యారమయ్యే అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియోతో.. శ్రావణ భార్గవి చిక్కుల్లో పడ్డారు. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడంతో.. సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కింది.

అయితే.. ఈ వీడియోపై శ్రీవారి భక్తులు టీటీడీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. YouTube నుండి వీడియో తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు టీటీడీ ప్రతినిధులు. ఆ వీడియోలో తప్పేముంది అంటున్న భార్గవి…వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు వివాదంగా మారింది. కాగా.. ఇటీవల తన భర్తకు శ్రావణ భార్గవి విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news