కారులో కొత్త టెన్షన్.. కేటీఆర్‌కు నో ఛాన్స్?

-

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అనే డౌట్ లో ఉన్నారు. అయితే కేసీఆర్ ఏమో కేంద్రంపై ఫోకస్ పెట్టి రాజకీయం చేస్తున్నారు..దీంతో తమ పరిస్తితి ఏం అవుతుందని కారు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాకపోతే కొద్దో గొప్పో కేటీఆర్ ఉన్నారు కదా? అనే ధైర్యం చాలామంది గులాబీ నేతల్లో ఉందని చెప్పొచ్చు.

ఎందుకంటే నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఆయన కృషి చేస్తారని అనుకుంటున్నారు..అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పలువురు నేతలు క్లారిటీ తో ఉన్నారు. ఆ మధ్య కూడా కేటీఆర్ సీఎం అవుతారని కామెంట్లు చేశారు. ఇక కేటీఆర్ సీఎం అవుయతరనే నేపథ్యంలో చాలామంది…కేటీఆర్ కు భజన చేయడం కూడా స్టార్ట్ చేశారు.

అలాగే కేసీఆర్ కంటే కేటీఆర్ సీఎం అయితే తమకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని కొందరు నేతలు భావిస్తున్నారు..ఇంకా కేసీఆర్ ని కలవడం అనేది చాలా కష్టమైన పని అని, అదే కేటీఆర్ ని కలవడం అనేది ఈజీ అని అనుకుంటున్నారు. మొత్తానికి కేటీఆర్ పై కారు నేతలు ఆశలు పెట్టుకున్నారు…కానీ తాజాగా ఆ ఆశలని కేటీఆర్ నీరుగార్చారు…మళ్ళీ సీఎం అయ్యేది కేసీఆర్ అని ప్రకటించారు. హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని అన్నారు.

అయితే దీనిపై విజయశాంతి సెటైర్లు వేశారు..అంటే తనకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వడం లేదని పరోక్షంగా కేటీఆర్ చెబుతున్నట్లు ఉందని అన్నారు. వాస్తవానికి చూస్తే అలాగే ఉంది…తన తండ్రి కేసీఆర్ తనకు సీఎం అయ్యే ఛాన్స్ ఇవ్వడం లేదనే విధంగానే కేటీఆర్ పరోక్షంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ పై ఆశలు పెట్టుకున్న కారు నేతలు సైలెంట్ అయ్యారు. మొత్తానికి సీఎం అభ్యర్ధి విషయంలో గులాబీ పార్టీలో గుబులు రేపుతోందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news