హైదరాబాద్ లోని నారాయణగూడ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసాడు ఓ భర్త. నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను వదిలేశాడు. కొద్ది రోజులుగా వారి మధ్య గొడవ కావడంతో, ఆమెను వదిలేశాడు. అయితే, నిన్న రాత్రి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఆ మహిళ రెండో భర్తతో కనిపించడంతో వారిపై పెట్రోల్ పోసిని నిప్పంటించాడు మొదటి భర్త.
కొన్ని సంవత్సరాలుగా మొదటి భర్తకు దూరంగా ఉంటూ మరొక వివాహం చేసుకొని ఒక బాబుతో ఉంటోంది ఆ మహిళ. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇక స్థానికులు బాధితులను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చిన్న బాబు 40 శాతం పైగా కాలిపోవడంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.