BREAKING: తెలంగాణలో మరో దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ఘటన

-

BREAKING: తెలంగాణలో మరో దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ ఘటన తెరపైకి వచ్చింది. షాద్‌నగర్‌ లో దళిత మహిళా పై థర్డ్ డిగ్రి ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన కళావతి అనే మహిళను బెదిరిస్తున్నారట ఎస్ఐ రమేశ్‌కుమార్. కళావతి కుమారుడు మైనర్.

The incident of third degree on a Dalit woman in Shadnagar is another incident before being forgotten

అయితే.. మూడు నెలల క్రితం మరో మైనర్‌ బాలికతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కళావతి కుమారుడు. దీంతో మూడు నెలలుగా స్టేషన్ చుట్టూ తిరుగుతోంది కళావతి. కుమారుడి జాడ చెప్పాలంటూ చేతులు, కాళ్ళ పై కొట్టడంతో బొబ్బలు వచ్చాయంటోంది కళావతి. తుపాకీతో బెదిరించి చంపుతానని ఎస్ఐ రమేశ్ బెదిరిస్తున్నాడని అంటున్నది కళావతి. రోజు కూలీ పనికి వెళ్ళే తాను, ఇలా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని అంటున్నది కళావతి. దీనిపై ఇంకా విరరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news