గ్రామానికి నిద్ర లేకుండా చేస్తున్న చిరుత…?

-

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు ఇప్పుడు పులుల భయంతో కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక సరిహద్దు గ్రామాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో రోజు రోజుకి పులుల సంచారం పెరుగుతుంది. అటు మావోయిస్ట్ ల అలజడి కూడా జిల్లాలో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఒక చిరుత పులి ఒక గ్రామానికి నిద్ర లేకుండా చేస్తుంది.

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం తండాలో చిరుత సంచారం ఉంది. చిరుత పులి సంచారంతో భయాందోళనలో తండా వాసులు ఉన్నారు. 15 రోజుల్లో రెండు సార్లు దర్శనమిచ్చిన చిరుత పులి ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందో అని కంగారు పడుతున్నారు. చిరుతను పిల్లలను చూసామని అక్కడి తండా వాసులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news