పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆందోళనకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఆందోళన చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు.డబుల్ బెడ్ రూం నివాసాలు నిర్మాణం చేయకుండా పేద ప్రజలను మభ్యపెడుతూ ఇంకెంతకాలం మోసం చేస్తారని టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ రోహిన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోలీసుల కోసం భారీ భవనాలు నిర్మించి అహో ఓహో అంటూ గొప్పలు పోతున్నారని కానీ.. పేద ప్రజలను మాత్రం డబుల్ బెడ్ రూం నివాసాలు అంటూ హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు.

 

ప్రభుత్వం చాలా రోజుల నుంచి డబల్ బెడ్ రూమ్ ల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అంటే ఈ పథకం కూడా ఎత్తేసినట్లేనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్ రూములు కూడా నాణ్యత లేదని అన్నారు. డబల్ బెడ్ రూమ్ లో విషయంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా ఇలా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే ప్రగతి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు.