తెలంగాణలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ఒక కోడి గుడ్డు ధర రూ. 7 గా అమ్ముతున్నారు. పది రోజులలో ఏకంగా రూ. 80 కి చేరింది డజన్ కోడిగుడ్ల ధర. ఈ ఏడాది నుంచి డజన్ గుడ్ల ధర 65 నుంచి 70 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 80 కి చేరింది. ఇటీవల కాలంలో కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది.
రూ. 6 అయినా సరే భారీగానే గుడ్ల కొనుగోలు జరుపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలలో సైతం గుడ్డు రోజు మెనూలో భాగం అయిపోయింది. కోడిగుడ్ల రేటు పెరగడానికి మెయిన్ రీజన్ వినియోగంతో పాటు దానా ధరలు పెరగడమే కారణమని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు.