ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు..!

-

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి తాజాగా ఖరారు చేసింది.  ప్రధానంగా  మే 06న ఈసెట్, మే 09న ఎంసెట్, మే 23న ఎడ్ సెట్, జూన్ 03న లాసెట్, జూన్ 04, 05న ఐసెట్, జూన్ 06న పీజీ ఈసెట్ నిర్వహిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించిన ఉన్నత విద్యామండలి తీవ్ర కసరత్తులు చేసింది. ఇందులో భాగంగా రాత పరీక్షల షెడ్యూల్ ని అధికారులు రూపొందించారు. 

గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఆమోదం తీసుకున్నారు. దీంతో పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించారు. విద్యార్థులు ఆయా పరీక్షలకు బాగా ప్రిపేర్ అయి మంచి ర్యాంకులు సాధించాలని అధికారులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news