ఐటీ దాడులకు భయపడేది లేదు – మంత్రి జగదీష్ రెడ్డి

-

తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుండి బిఆర్ఎస్ కి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇల్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఉదయం 6 గంటల నుండి మొత్తం 30 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

భువనగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల నివాసాలు, కార్యాలయాలు, మాల్స్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలపై తాజాగా స్పందించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ దాడులు బిజెపి ప్రేరేపిత దాడులేనని ఆయన విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని బిజెపి ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారంతా వైట్ పేపర్ వ్యాపారాలు చేస్తున్నారని, పార్టీలోకి రాకముందే వారికి వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news