మార్కెటింగ్ లో రేవంత్ ను మించినోడు లేడు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

“నేను ఓడిపోతే కేసీఆర్ నాకు ఉద్యోగం ఇచ్చారని రేవంత్ మాట్లాడారని.. తెలంగాణ ఉద్యమంలో ఆరంభం నుంచి ఉన్న నా చరిత్ర గురించి అందరికీ తెలుసు” అని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్.  పదవుల కోసం ఏనాడు పాకులాడలేదని తెలిపారు.  తెలంగాణ భవన్ లో ఆయన  మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంతా..? నా గురించి మాట్లాడేదని మండిపడ్డారు. తాను తెలంగాణ కోసం ఎంపీగా రాజీనామా చేసి గెలిచానని.. ఢిల్లీలో తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్ తో కలిసి ప్రయత్నించానని తెలిపారు.

ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా నా భాద్యతను తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వర్తించానని, నా గురించి సీఎం హేళనగా మాట్లాడినందుకే స్పందిస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు కేసీఆర్ హయంలో ఉద్యోగాలు ఇవ్వలేదు అనట్టు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినా మేము హంగామా ప్రచారం చేసుకోలేదని, మార్కెటింగ్ లో రేవంత్ ను మించినోడు లేడని వ్యాఖ్యానించారు. మేము ఉద్యోగాలు ఇస్తే నియామక పత్రాలు పోస్టులో వెళ్ళేవని.. ఇపుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news