కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోంది.. ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలను ఒక్కటి కూడా అమలు చెయ్యలేదు.. ప్రజల్లో వ్యతిరేకత.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీలోప్రచారం జరుగుతోంది.. ఎప్పటి నుంచి సూపర్ సిక్స్ ను పట్టాలెక్కించాలనే దానిపై ఆయన ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.. సరైన ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నారు..
ఆర్దిక వనరులు సమకూర్చుకుని.. సంక్రాంతి నుంచి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారట.. తల్లికి వందనం మినహా మిగిలినవి అమలు చెయ్యాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే ఆలస్యమైందని..త్వరగా అమలు చెయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని చంద్రబాబు కొందరు మంత్రుల వద్ద ప్రస్తావించారట.. పింఛన్లు మినహా ఏ హామీ అమలు పర్చలేకపోయామని.. దీన్ని వైసీపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదముందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారట..
చంద్రబాబుకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బేస్ చేసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. రాజదాని అమరావతి నిర్మాణానికి నిధులతో పాటు.. కేంద్ర సాయం కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు.. మరోపక్క పోలవరానికి కూడా కేంద్రం నిధులు విడుదల చేసేందుకు సిద్దమైంది.. ఈ క్రమంలో సూపర్ సిక్స్ హామీల అమలుపై ఆయన దృష్టి పెట్టారట..
దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తానని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు.. అది పూర్తయిన వెంటనే.. ఉచిత బస్సును సంక్రాంతికి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్టీయార్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.. హామీల అమలుకు కావాల్సిన నిధులపై ఆయన ఆర్దికశాఖకు చెందిన అధికారులతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇవన్నీ సెట్ చేసుకుని.. సంక్రాంతికి సంక్షేమ పథకాలను ట్రాక్ లోకి తీసుకురావాలని బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు..ఇవి కార్యరూపం దాలుస్తాయో లేదో చూడాలి..