25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక డేట్ ఇదే.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి ఈనెల 11 సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండటంతో  ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్లో చేరాతన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని బాంబు పేల్చారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయన్నారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news