తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. మోర్తాడు కార్నర్ వద్ద ఆయన మాట్లాడారు. ముఖ్యంగా దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టిఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య యుద్ధం జరుగుతుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కేటీఆర్ లూటీ చేసిన డబ్బులను వెనక్కి రప్పిస్తానని తెలిపారు. ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని పెన్షన్ రూపాయలు నాలుగు వేలు ఇస్తామని పేర్కొన్నారు రాహుల్. సోనియా గాంధీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు.
తెలంగాణలో దొరలపాలను సాధనంపై ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం. మీకు నా మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధము కాదు కుటుంబా. మేము ఎక్కడ బీజేపీతో యుద్ధం చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోంది. బిజెపితో పోరాడుతున్నందుకే నాపై కేసులు పెట్టారు లోక్సభ సభ్యత్వం రద్దు చేశారు ఇల్లు లేకుండా చేశారు నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో గానీ కోట్లాదిమంది భారతీయుల హృదయాలనుంచి బయటకి పంపలేరు నన్ను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని దోషం చెప్పారు. తెలంగాణలో జరిగే ఏ దండాలు చూసినా కేసిఆర్ కుటుంబం దోపిడీ నే కల్పిస్తుందన్నారు.