తెలంగాణాలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు గాలం వేసిన బిజెపి…!

-

ఇప్పుడు తెలంగాణాలో బిజెపి బలపడటానికి నానా రకాల కష్టాలు పడుతుంది. తెలంగాణాలో బిజెపికి ఇప్పుడు ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి అనేది పక్కన పెడితే ఆ పార్టీకి మాత్రం చాలా వరకు నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ చిన్న చిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా దాదాపుగా అభ్యర్ధులు లేని పరిస్థితి ఉందీ అనేది వాస్తవం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస నాయకులకు బిజెపి సీట్లు ఇచ్చుకున్న పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు ఇతర పార్టీల నాయకులను తీసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణా కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి గాలం వేసింది బిజెపి. కాంగ్రెస్ లో వీరు మాత్రమే చాలా కీలకంగా ఉన్నారు. వీరు ముగ్గురు ఎంపీలే. దీనితో వీరిని ఎలా అయినా సరే పార్టీలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కిషన్ రెడ్డి ఉత్తమ్ కి కోమటిరెడ్డికి గాలం వేసారని ఉత్తం కి కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన నేరుగా ఆఫర్ చేసారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఉత్తమ్ కి బలమైన నేతగా గుర్తింపు ఉంది. అయితే ఆయన సౌమ్యుడు… తెలంగాణా కాంగ్రెస్ లో చాలా మంది ఆయన మాట వినే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. అదే విధంగా కోమటిరెడ్డి కి కాస్త దూకుడు ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఆయనకు నల్గొండ జిల్లాలో మంచి పేరు ఉంది. ఆయన పార్టీలోకి వస్తే తమకు మంచి లాభం అని భావిస్తుంది బిజెపి. రేవంత్ రెడ్డి కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినా సరే రాహుల్ గాంధీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అని దీనితో పార్టీ మారే అవకాశం తక్కువ అని బిజెపి భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news