తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దూకుడగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీ బిజీ ఉంటున్నారు. ఇటీవల గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు గూడెంలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చెంచులతో సమావేశం అయిన గవర్నర్ తమిళి సై.. పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు తాజా గా మరో పర్యటనకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సిద్ధం అయింది.
నేడు వరంగల్ జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు. హన్మకొండలో జాతీయ సంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గవర్నర్ తమిళి సై రానున్నారు. కాగ ఈ జాతీయ సంస్కృతీ ఉత్సవాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాల తో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వహకులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాగ ఈ సంస్కృతీ ఉత్సవాలు.. హన్మకొండలోని అర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరగనున్నాయి.