నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దూకుడు పెంచేశారు. వ‌ర‌స పర్య‌ట‌నల‌తో రాష్ట్రంలో రాజ‌కీయా వేడిని నింపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికే జ‌న‌గామ తో పాటు య‌దాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించారు. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన్నారు. అలాగే ముంబై ప‌ర్య‌ట‌న కు కూడా వెళ్లాడు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ ను క‌లిసి దేశ రాజకీయాలపై చ‌ర్చించారు. తాజా గా సీఎం కేసీఆర్.. మ‌రో సారి జిల్లాల ప‌ర్య‌ట‌న కు సిద్ధం అవుతున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ని సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌నున్నారు. సంగమేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్.. శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయ‌ణ ఖేడ్, జ‌హీనాబాద్, ఆందోల్ తో పాటు సంగారెడ్డిలోని నియోజ‌క వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు తాగు, సాగు నీటి అవ‌స‌రాలు తీర్చ‌నున్నాయి. కాగ ఈ రెండు ప్రాజెక్టులకు నీరు.. కాళేశ్వ‌రం మెగా ప్రాజ‌క్ట్ నుంచి దాదాపు 20 టీఎంసీల నీటిని కేటాయించ‌నున్నారు.

కాగ సీఎం కేసీఆర్.. ప్రాజెక్టుల శంకుస్థాప‌న‌ల‌తో పాటు ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభింస్తారు. అనంత‌రం ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. కాగ నిన్న మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌నకు వెళ్లి.,. దేశ రాజ‌కీయాల‌ను త‌న వైపు తిప్పుకున్న కేసీఆర్.. ఈ బ‌హింర‌గ స‌భ‌లో ఏం మాట్లాడుతారో అనే ఉత్కంఠ నెల కొంది.

Read more RELATED
Recommended to you

Latest news