ఈనెల 21 నుంచి తెలంగాణ కానిస్టేబుళ్లకు శిక్షణ

-

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగులకు ట్రైనింగ్‌ కు మహుర్తం ఫిక్స్‌ అయింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఈనెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 13,444 మంది అభ్యర్థులు ఉన్నారు.

Training for Telangana constables from 21st of this month

సరిపడా వసతులు లేకపోవడంతో టీఎస్ఎస్పీ విభాగానికి చెందిన 5,010 మందికి ట్రైనింగ్ ను వాయిదా వేశారు. వీరి కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రాలను అన్వేషిస్తున్నారు. ఒకవేళ అక్కడ కేంద్రాలు కుదరకపోతే టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లు మరికొన్ని నెలలు వేచి చూడాల్సి రావొచ్చు.

కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే…ఈ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ సమయంలోనే ఫలితాలు వచ్చాయి. కానీ.. ఫలితాల సమయంలో… కొందరు కేసులు వేయడంతో.. పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగుల ట్రైనింగ్‌ కు చాలా సమయం పట్టింది. ఇక తాజాగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఈనెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news