తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. మొత్తం 26మంది ఐఏఎస్ ల బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. సంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, గద్వాల కలెక్టర్‌ల బదిలీలు చేపట్టింది. నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచంద్రను నియమించింది.
పలువురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు :
* రంగారెడ్డి కలెక్టర్ గా డా. శశాంక
* మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్ ఎక్కా
* ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ – అహ్మద్ నదీమ్
* స్మిత సబర్వాల్ – ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరి
* ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఎ. శరత్
* ప్రజావాణి నోడల్ ఆఫీసర్, డైరెక్టర్ మున్సిపల్ గా డి. దివ్య
* నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచందన
* ఆర్కియాలజీ డైరెక్టర్ గా భారతీ హోళికేరి
* కార్మిక శాఖ డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య