దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఉంటే 19 గ్రామాలు తెలంగాణవే: సీఎం కేసీఆర్

-

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని.. తెలంగాణకు టీఆర్ఎస్ రక్షణ కవచం అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశంలో అతి ఉత్తమమైన గ్రామాలు ఉంటే టాప్ 10 లో పదికి పది తెలంగాణ గ్రామాలే ఉన్నాయని… ఉత్తమమైన గ్రామాల్లో 20కి 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని కేసీఆర్ అన్నారు. ఓ నిబద్ధమైన పద్దతిలో పూర్తి అవినీతి రహితంగా పాలిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఒక నాడు కరువు కాటకాలు ఉండే తెలంగాణ  నేడు జల భాండాగారంగా తయారైందని… కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అంతర్జాతీయ ఛానెళ్లు కీర్తిస్తున్నాయని ఆయన అన్నారు. విద్యుత్ రంగంలో దేశమంతా కారుచీకట్లు కమ్ముకుంటే… వెలుగుజిలుగుల తెలంగాణను మనం సాధించుకున్నామని ఆయన అన్నారు. తాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాల్లో మొదటి స్థానంలో ఉన్నామని.. దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news