ఆనంద‌య్య మందుపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మొత్తానికి డాక్ట‌ర్ అనిపించుకున్నాడు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆనంద‌య్య మందుపై ఎంత పెద్ద చ‌ర్చ జ‌రుగుతుందో అంద‌రం చూస్తూనే ఉన్నాం. అల్లోప‌తిని స‌పోర్టు చేసేవాళ్లు దాన్ని వాడొద్దంటూ ప్ర‌చారం చేస్తుంటే.. ఆయుర్వేదాన్ని స‌పోర్టు చేసేవాళ్లు వాడొచ్చు అని చెబుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో ఈ వాద‌న‌లు కాస్తా అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదంగా చిత్రీక‌రిస్తున్నారు చాలామంది.

 

ఇక సోష‌ల్ మీడియాలో అయితే అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం ఫైట్ జరుగుతోంది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ మాట్లాడుతూ మూఢ న‌మ్మ‌కాలు వ‌ద్దంటూ చెప్పారు.

డాక్టర్లు సూచించిన మందులే వాడాలని సూచించారు. ఆనందయ్య మందు వాడి జగిత్యాల ప్ర‌జ‌లు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, కాబ‌ట్టి అల్లోప‌తి డాక్టర్ల వాడాల‌ని కోరారు. ఒక‌వేళ ఆనంద‌య్య మందుతో త‌గ్గితే ఆయ‌న కాళ్ల‌కు పాదాభివంద‌నం చేస్తాన‌ని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై చాలామంది మండిప‌డుతున్నారు. సంజ‌య్ అల్లోప‌తి డాక్ట‌ర్ కాబ‌ట్టి ఆయుర్వేదాన్ని వ్య‌తిరేకిస్తున్నారంటూ చెబుతున్నారు.