టిఆర్ఎస్ పార్టీకి రూ.1000 కోట్ల ఆస్తి ఉంది – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ రక్షణ కవచం అని… 1000 కోట్ల ఆస్తుల సంస్థగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందిందని.. ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటన చేశారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎదగడంలో ఎన్నో ఒడిదొడుకులను టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొందని తెలిపారు.

తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచం.. దేశంలోని 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయన్నారు.. తెలంగాణలోని అన్ని శాఖలకు అవార్డులు, రివార్డులు వచ్చాయి.. ప్రాజెక్టులతో తెలంగాణ జలధారగా మారిందని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.

సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని వెల్లడించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనూ కరెంట్ కోతలున్నాయి.. కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. తెలంగాణలో అవినీతి మంత్రులు లేరని ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ తలసరి ఆదాయం 2.78 లక్షలు అని సిఎం కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news