ఎమ్మెల్యేలకు ఎర కేసు.. పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సైబరాబాద్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సైబరాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం నిందితులకు పలు షరతులు విధించింది. ‘‘నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు. ముగ్గురు నిందితులు ఇవాళ సాయంత్రం 6గంటల లోపు తమ నివాస ప్రాంత వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు సమర్పించాలి. ఈకేసుతో సంబంధం ఉన్న రోహిత్‌రెడ్డితో పాటు ఇతరులతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంప్రదింపులు జరపవద్దు’’ అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news