టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి!

-

టీఎస్‌పీఎస్సీ కొత్త ఛైర్మన్‌, సభ్యుల నియామకంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కమిషన్ ఛైర్మన్గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. అయితే వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు రాగా పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకోగా స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news