తన తండ్రి కబ్జా చేసిన భూమిని ఊరికి ఇచ్చేసింది MLA ముత్తిరెడ్డి కూతురు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి స్థలంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవాని రెడ్డి పేరు మీద ఉన్న 1270గజాల స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటికి రిజిస్ట్రేషన్ చేస్తానని చెబుతూ ప్రహారీ గోడలను తొలగించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తుల్జాభవాని రెడ్డి.
ఈ సందర్భంగా తుల్జాభవాని రెడ్డి మాట్లాడుతూ, చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలంలోని 1402సర్వే నెంబర్లో గల 1270గజాల స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తాను..ఈ స్థలాన్ని మరల ఎవరి పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం తప్పు…నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని,ఒక నెలకు కోటిన్నర రూపాయల రెంట్లు వస్తాయన్నారు.ఇటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తప్పు,చేర్యాల ప్రజలు క్షమించండి…ఈ భూమిని తిరిగి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కలెక్టర్ గారికి అప్పగిస్తనని ప్రకటించారు.