సికింద్రాబాద్ అల్లర్ల లో ట్విస్ట్.. రెండు రోజుల క్రితమే వాట్సాప్ గ్రూప్ ల్లో స్కెచ్ !

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం విచారణ కొనసాగుతోంది. ” చలో సికింద్రాబాద్ ” అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో వచ్చిన 300 మంది అభ్యర్థులను గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు రైల్వే పోలీసులు. ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు.. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news