సిద్దిపేట్ జిల్లా కు చెందిన సాయి కిరణ అనే జవాన్ కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన విషయం తెలిసిందే. సాయి కిరణ్ పంజాబ్ సరిహద్దు లో జవాన్ గా చేస్తున్నాడు. అయితే సెలవుల కోసం ఇంటి కి వచ్చి.. తిరిగి పంజాబ్ వెళ్లే క్రమం లో తప్పిపోయాడు. అయితే ఈ మిస్సింగ్ కేసులో ఒక ట్విస్ట్ వెలుగు లోకి వచ్చింది. సాయి కిరణ్ మిస్ అయిన నాటి నుంచి ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి లవాదేవీలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ పోలీసులు సాయి కిరణ్ కేసు విషయం లో పంజాబ్ లో ని బటిండా వెళ్లారు. పలు ప్రదేశాల్లో విచారణ చేపట్టారు.
ఢిల్లీ, రాజస్థాన్, రోహ్తక్ వంటి ప్రాంతాలలో సాయి కిరణ్ అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగాయాని పోలీసులు గుర్తించారు. అలాగూ ఈ నెల 6న బటిండా రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమరాలలో రికార్డు అయిందని గుర్తించారు. అయితే అక్కడి నుంచి సాయి కిరణ్ ఎక్కుడికి వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. అయితే తదుపరి విచారణ కు పోలీసులు ఢిల్లీ కి వెళ్లనున్నారు. చివరి సారి గా సాయి కిరణ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఢిల్లీ లో నే జరిగాయి.