రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం.. రాష్ట్రంలో మ‌రో రెండు క్యాథ్ ల్యాబ్‌లు

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య రంగంలో వ‌ర‌స‌గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను తీసుకువ‌చ్చారు. అలాగే ప‌లు ఆస్ప‌త్రుల‌లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. తాజా గా రాష్ట్రంలో మ‌రీన్ని క్యాథ్ ల్యాబ్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఈ క్యాథ్ ల్యాబ్ ల ద్వారా ప‌రిష్క‌రించ‌వ‌చ్చు. ఈ క్యాథ్ ల్యాబ్ లో గుండె జ‌బ్బుల‌కు ప‌రీక్షలు, చికిత్స చేయడానికి అవ‌స‌రం అయ్యే అత్యాధునిక సౌక‌ర్యాలు ఉంటాయి.

కాగ‌ ఈ రోజు ఖ‌మ్మం లో రాష్ట్ర వైద్య‌ ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించ‌నున్నారు. అలాగే రాష్ట్రంలో మ‌రో రెండు క్యాథ్ ల్యాబ్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే ఏడాదిలో సిద్ధిపేట్ తో పాటు 2024 మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాకాలు చేస్తుంది. అయితే ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఉస్మానియా, నిమ్స్ ల‌ల్లోనే క్యాథ్ ల్యాబ్స్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే గాంధీ ఆస్ప‌త్రిలో క్యాథ్ ల్యాబ్ ఉన్నా.. ఉప‌యోగంలో లేదు. అయితే గాంధీ ఆస్ప‌త్రిలో ఉన్న క్యాథ్ ల్యాబ్ ను ఉప‌యోగంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాల‌ను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news