ఉమామహేశ్వరరావు భాగోతాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్ళిన బాధితులకు చుక్కలు చూపించిన ఉమామహేశ్వరరావు…. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడిందని అధికారులు తేల్చారు. అయినా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు… సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నాడు. సిసిఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉoటూ వారితోనే బేరసారాలు చేశాడట.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్నారై ను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నాడట. ఉమా మహేశ్వర రావు బూతు పురాణం పై సిబ్బంది అసహనం వ్యక్తం చేశారట. తోటి సిబ్బందిని సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయట. తన దగ్గరికి వచ్చినప్రతి కేస్ లో ను ఉమా మహేశ్వర రావు చేతివాటం ప్రదర్శించాడట. అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశాడట. తన ఇంట్లో నగదు ఉంచకుండా, తన అత్త మామ ల ఇంట్లో డబ్బును ఉంచిన ఉమా మహేశ్వర రావు….లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్ లో రాసుకున్నాడట. బహిరంగ మార్కెట్ లో 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించింది ఏసిబి. కాగా ఉమామహేశ్వరరావు నిన్న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.