తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు అత్యంత కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉన్నత అధికారులు పాల్గొననున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగ తెలుగు రాష్ట్రాలు విడిపోయి.. ఏడు సంవత్సరాలు గడుస్తుంది.
అయితే ఇప్పటి వరకు కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలాగే కొన్ని అంశాలలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంటుంది. అయితే కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం అయితే ఈ వివాదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే ఈ రోజు సమావేశం కానున్నారు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు భిన్న అభిప్రాయాలు షెడ్యూల్ 9, 10 లో గల సంస్థల విభజన పై ఎక్కువ వస్తున్నాయి. అయితే దీని పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.