BRS పార్టీలోకి కాంగ్రెస్‌ కీలక నేతలు ?

-

 

 

బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో జగ్గారెడ్డి వెళుతున్నారని సమాచారం అందుతోంది. గత వారంలో రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలు అందరూ… కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో.. కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వెళుతున్నారని సమాచారం అందుతోంది.

గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి… తన మీద కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో ట్రొల్ వీడియోస్ చేయిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలో అలిగిన కోమటిరెడ్డి , ఉత్తమ్.. కోమటిరెడ్డి ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు మాత్రం వెళ్ళలేదు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తోడు జగ్గారెడ్డి, మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా చేరుతారనే వార్త బీఆర్ఎస్ వర్గాల నుండి వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news