మీ ఇంట్లో దేవతలు తిరుగుతుంటే.. ఈ సూచనలు కనిపిస్తాయి..!

-

పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని.. అయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు..? ఎటువంటి సూచనలు కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. దేవతల కనుక ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మీ మీద ఉంటుంది. ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తుంటే దైవాన్ని గ్రహం ఉందని దేవతల ఇంట్లో ఉన్నట్లు తెలుసుకోవచ్చు.

దేవతలకి కాకికి అభినవభవ సంబంధం ఉంటుందట. దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే మన మీద దైవానుగ్రరహం ఉంటుందని పండితులు అన్నారు అదే విధంగా ఉదయం పూట ఉడుత కనిపించినా కూడా దేవతలు మన ఇంట్లో ఉన్నట్లు దానికి అర్థం. అంతే కాదు వంట గది లో పూజ గది లో ఎక్కువగా బల్లులు కనబడుతూ ఉంటాయి. అయితే ఇంట్లో బల్లులు ఎక్కువగా కనబడుతున్నట్లయితే లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని త్వరలో ఆర్థిక భాదలు అన్నీ కూడా దూరమవుతాయని దానికి సంకేతం.

ప్రతి నిత్యం దీపారాధన ని మన ఇంట్లో చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం దీపారాధన చేసేటప్పుడు దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఒకవేళ కనుక గాలి లేకపోయినా అటు ఇటు ఊగుతూ దీపం వెలుగుతున్నట్లయితే ఇంట్లో దేవతలు లేనట్లు. అలానే పాలు పొంగితే కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతోందని సంకేతం. ఇలా వీటి ద్వారా మనం దేవతలు ఇంట్లో వున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news