నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్డ్ కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు బాగా ఖర్చుతో కూడుకున్నాయని అన్నారు. గాంధీ భవన్‌లో మీడియాతో ఇష్టా గోష్టిలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 వరకు ఎన్నికలకు పెద్దగా ఖర్చయ్యేది కాదని ..2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియల్‌గా మారాయని అన్నారు. ఆ కమర్షియల్ రాజకీయాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
రాజకీయాల్లోకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నందున అక్టోబర్ లేదా నవంబర్‌లో రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు ఉత్తమ్ తెలిపారు. రిటైర్డ్ అయ్యాక ఏదో ఆధ్యాత్మి కేంద్రంలో చేరి ప్రశాంతమైన జీవనం గడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ రెండు ఒకేసారి జమిలి ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నట్లు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వల్ల లిక్కర్ కేసు తీవ్రంగా మారుతుందన్న ఉత్తమ్.. ఆయన నిజంగా అప్రూవర్‌గా మారితే అది ఆప్‌కు చావు దెబ్బేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.