ధరణి వల్ల దొరలకే లాభం అవుతుంది – VH

ధరణి దొరలకే లాభం చేకూరుస్తుంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఇదేనా ధరణి లక్ష్యం? అని ప్రశ్నించారు. పేదల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నాడని.. పేదలకు ఇచ్చిన భూములను కెసిఆర్ దొరలకు ఇస్తున్నాడని మండిపడ్డారు. 1981లో కీసరలో పేదలకు ఆ భూములను కాంగ్రెస్ ఇచ్చిందని.. దాదాపు 94 ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు.

ఒకరిద్దరు దళితులు చనిపోతే పాత పట్టాదారుల పేరు మీద భూమి మార్పిడి చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ భూములను అన్నింటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల వివరాలను ఇవ్వాలని హెచ్ఎండిఏ అధికారులను కోరినప్పటికీ ఇవ్వడంలేదని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు పేదల భూముల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కోకాపేట నుండి కీసర వరకు తిరుగుతానని తెలిపారు వీ హనుమంతరావు. మోడీ, కెసిఆర్ ఇద్దరూ ఇద్దరేనని మండిపడ్డారు.