షాక్: మంగళవారమా ఇదేదో తేడాగా ఉందే..!!

ఆర్‌ఎక్స్‌100 సినిమా హీరోగా కార్తికేయకు,హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌  డైరెక్టర్‌గా అజయ్‌ భూపతి లకు మంచి పేరు తెచ్చింది. ఈ ఒక్క సినిమా తో హీరో, హీరోయిన్స్ కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత అజయ్‌ భూపతి రెండో సినిమా గా మహాసముద్రం ను తీశాడు.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్లాప్ అయ్యింది. దీనితో టాలెంటెడ్ డైరెక్టర్ గా వచ్చిన పేరు మొత్తం పోయింది.

దీని నుండి తేరుకున్న అజయ్‌ ప్రస్తుతం ఒక సూపర్  కథతో ఈ సినిమా చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడట. ఇది కూడా ఆర్ఎక్స్ 100  సినిమా లాగానే పూర్తిస్దాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాత కూడా ఉంటారని  వార్తలు వస్తున్నాయి

ఇక ఈ చిత్రానికి మంగళవారం అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశాడని, గుస గుసలు వినిపిస్తున్నాయి.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఈ “మంగళవారం” అనేది పొలిటికల్ సర్కిల్లో పెద్ద హాట్ టాపిక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై అక్కడి అధికార పక్షం మరియు ప్రతి పక్షం దీనిపై ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. ఇక జబర్దస్త్ కామెడీ షో లో మంగళవారం పై వేసే పంచ్ లకు లెక్కే లేదు. దీనితో ఈ పేరు మీద రాబోయే రోజుల్లో పెద్ద దుమారం రేగే అవకాశం ఉంది.