రాజ్​గోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది : వంశీచంద్ రెడ్డి

-

మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదని.. పార్టీని వీడరని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి స్పష్టం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని రాజగోపాల్​రెడ్డి నివాసంలో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు వెల్లడించారు.


ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డిని తాను రోజూ కలుస్తానని వంశీచంద్​రెడ్డి తెలిపారు. తెరాసతో కొట్లాడేది కాంగ్రెస్​ పార్టీనే అని స్పష్టం చేశారు. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లోనే ఉండి తెరాసతో కోట్లాడతాడన్నారు. రాజగోపాల్​రెడ్డి పార్టీ మార్పుపై ఇటీవల బండి సంజయ్ మాటలు ఉత్తవేనని కొట్టిపారేశారు.

‘రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడరు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరు. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. నేను రాజగోపాల్ రెడ్డిని రెగ్యులర్​గా కలుస్తా. రాజగోపాల్​ రెడ్డి పార్టీలో ఉంటూనే తెరాసతో కొట్లాడతారు.’ అని వంశీచంద్​రెడ్డి అన్నారు.

అంతకుముందు ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి రాజగోపాల్​రెడ్డితో భేటీ అయ్యారు. రాజగోపాల్‌ పార్టీ మారకుండా చూసే బాధ్యతను పార్టీ అధిష్ఠానం ఆయనకు అప్పగించడంతో ఇవాళ జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని ఉత్తమ్‌ బుజ్జగించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news