గవర్నర్ బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఇవాళ వి.హనుమంతరావు…మీడియాతో మాట్లాడుతూ… బండారు దత్తాత్రేయ తెలంగాణ కోసం పోరాడితే నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేంద్రం పిలవలేదని ఆగ్రహించారు. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బండారు దత్తాత్రేయ ఉద్యమంలో ఉన్నప్పుడు.. వీళ్లంతా ఎక్కడ ఉన్నారు… కనీసం బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలవకపోవడం మంచిది కాదన్నారు. 20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని.. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం అంటూ వీహెచ్ పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేశారని… కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి వుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు…నెరవేర్చలేదు… బిఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేశారని.. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందని మండిపడ్డారు వీహెచ్.