శోభనం గదిలో ఉరివేసుకున్న వరుడు.. కారణం ఏమై ఉండొచ్చు..?

-

పెళ్లి తర్వాత శోభనం రాత్రి ఆ జంటకు చాలా మధురమైనది.. లవ్‌ మ్యారేజ్‌ అయితే ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారు. అదే అరేంజ్‌ మ్యారేజ్‌ అయితే అన్ని భయాలు, మొహమాటాలు ఉంటాయి.. ఏది ఏమైనా వారికి దొరికి మొదటి ఏకాంత సమయం అది. కానీ ఓ వరుడు శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ..! అయినా నమ్మాల్సిందే..! ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రెండ్రోజుల క్రితమే పెళ్లి జరిగింది. భార్యను ఇంటికి తీసుకొచ్చిన రోజే నవ వధువుతో పెళ్లికొడుకు గొడవ పడ్డాడు. అదే కోపంతో తొలిరాత్రికి సిద్ధం చేసుకున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పాల్పడిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా మచారియా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ తన ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వివాహం జరిగింది. రెండు రోజుల క్రితం పెళ్లికూతురుతో కలిసి ఇంటికి వచ్చాడు. పెళ్లి వేడుక నుంచి కొత్త జంటకు స్వాగతం పలకడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. అదే రోజు రాత్రి యువకుడు తన భార్యతో కలిసి గదిలో పడుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో భార్య టాయిలెట్‌కు వెళ్లింది. ఇంతలో వరుడు ఉరి వేసుకున్నాడు. భార్య టాయిలెట్ నుంచి తిరిగి వచ్చేసరికి మనోజ్ ఉరివేసుకుని ఉండటం చూసి షాకై కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది.

కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. వరుడిని కిందకు దింపారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కొత్త పెళ్లికొడుకు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టంకు తరలించి విచారణ చేపట్టారు. ఫస్ట్ నైట్ జరగాల్సిన గదిలో వరుడు ఉరివేసుకోవడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మచారియాగ్రామానికి చెందిన దేవిపూర్వ జసోదా కనౌజ్ గోల్డి కుమార్తెతో మనోజ్‌కుమార్‌కి వివాహమైంది. ఏదో విషయమై యువకుడు నవ వధువుతో గొడవ పడ్డాడని.. ఆ తర్వాత యువకుడు మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. మృతుని భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పడి ఉండొచ్చని..దాని వల్లే ఫస్ట్ నైట్‌ రూమ్‌లో మనస్పర్థలు తలెత్తి ఉంటాయని భావిస్తున్నారు. ఆ బాధను తట్టుకోలేక ఆ యువకుడు అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై వధువుకుటుంబ సభ్యులకు, పోలీసులు కానీ ఎలాంటి సమాచారం లేదు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిలో క్లూస్ కోసం వెదికారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు స్టేషన్‌ ఆఫీసర్‌ దైనిక్‌ భాస్కర్‌ తెలిపారు. టాయిలెట్‌కు వెళ్లి వచ్చే గ్యాప్‌లో ఉరివేసుకోని చనిపోవడం అంటే కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే. సాధారణంగా ఉరివేసుకన్న వెంటనే చనిపోరు.. టైమ్‌ పడుతుంది. టాయిలెట్‌కు మహా అంటే పదినిమిషాలు కూడా పట్టదు. మరీ ఈ గ్యాప్‌లోనే అతను ఉరివేసుకోవడానికి తాడు లేదా చీర ఏదో ఒకటి వెతుక్కోని, ఫ్యాన్‌కు వేసుకుని చనిపోయి ఉంటాడా.? అసలు ఆ రోజు రాత్రి గదిలో ఏం జరిగిందో.. వధువు నోరువిప్పాలి..!

Read more RELATED
Recommended to you

Latest news