బక్రీద్ రోజున గోవధ అడ్డుకోవాలి: విజ‌య‌శాంతి

-

తెలంగాణలో ఈ నెలలో బక్రీద్ తో పాటు బోనాల పండుగలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా పండుగలు జరిగే విధంగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా బక్రీద్ రోజున గోవధ అడ్డుకోవాలని బీజేపీ మహిళ నాయ‌కురాలు విజ‌య‌శాంతి Vijayashanti రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

విజ‌య‌శాంతి/ Vijayashanti
విజ‌య‌శాంతి/ Vijayashanti

హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారని విజ‌య‌శాంతి మండిపడ్డారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి… గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతి పత్రం ఇస్తే చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదని అన్నారు. అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలని విజ‌య‌శాంతి డిమాండ్ చేసారు.

అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చిందని ఈ సందర్భంగా విజయశాంతి గుర్తు చేసారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అనుసరించడం మాట పక్కనబెడితే , రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని ఆమె ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్నవారిపైన తెలంగాణలో దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. అలా కాదంటే, రాష్ట్ర ప్రభుత్వం హిందూ సమాజపు ఆగ్రహానికి గురికాక తప్పదని విజ‌య‌శాంతి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news