పాడి రైతులకు గుడ్‌ న్యూస్‌..విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

-

తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. విజయ డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. గేదె పాలు లీటర్ కు రూ.4.68, ఆవు పాలు లీటర్ కు రూ.2.88 చొప్పున పెంచినట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, ఆడి పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు.

ఈ ధరలు ఈనెల 16వ తేదీ నుంచి వర్తింపు లోకి వచ్చాయని తెలిపారు. మార్చి ఒకటో తేదీ నుంచి చెల్లించే బిల్లులకు ఈ నిర్ణయం అమలు కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించే లీటరు పాల ధర గతంలో 37 రూపాయలు ఉండేది.

ఇప్పుడు రూ.41.67 కు పెరిగింది. అలాగే ఆవు పాలు 30 రూపాయల నుంచి రూ.32.64 కు పెరిగి నరసింహ తెలిపారు. తద్వారా విజయ డైరీ కి పాలు పోసిన రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. అంతే కాక రైతులకు లీడర్ కు నాలుగు రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఎదవిదిగా ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news