కేసీఆర్‌ ఆరోగ్యంపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు

కేసీఆర్‌ ఆరోగ్యంపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు… మీకు అనారోగ్యమని హాస్పిటల్‌లో అడ్మిషన్ అవుతారని… బీఆరెస్ వారందరూ ఈడీ విచారణ దుర్మార్గం అంటారని మండిపడ్డారు.

సరే, ఇంత అయ్యినంక అయినా… “నా కుటుంబ సభ్యులెవ్వరికీ ఢిల్లీ లిక్కర్ స్కాంతో గాని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంకే అవినీతితో గాని, ఏ విధమైన సంబంధం లేదు, నేను నిప్పులాంటి నిజాయితీ నేతను… ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి మా కుటుంబమంతా వైదొలుగుతాం.” అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నరు కేసీఆర్ గారూ అంటూ నిలదీశారు.

మీడియా నుండి తప్పించుకోనీకే.. సమాధానం వెదుక్కునే ప్రయత్నానికి సమయం కోసం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాస్పిటల్‌లో చేరి ఉంటారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని చురకలు అంటించారు విజయశాంతి.