నీ సర్కార్‌కు, నీ కారుకు రోజులు దగ్గరపడ్డాయని సీఎం కేసీఆర్ పై విజయశాంతి ట్వీట్ చేశారు. కేసీఆర్ సర్కార్ పేరుకు మాత్రం ప్రజా ప్రభుత్వమని చెప్పుకోవడం..చేసేది మాత్రం ప్రజలను దోచుకోవడమని ఆగ్రహించారు. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం పేదలకు..ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందని చురకలు అంటించారు.
వాటితో వేరే రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 90 శాతం భూమి రైతుల వద్ద లేదు. అంతా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆక్రమణలోనే ఉన్నాయి. కేసీఆర్… నీ అక్రమాలు ఎంతో కాలం సాగవు. తొందర్లోనే నీ సర్కార్‌కు, నీ కారుకు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
అన్ని జిల్లాల్లో నిషేధిత భూమిని ప్రభుత్వ అధికారులే తెల్లకాగితాలపై రాయించుకుంటున్నరు. బెదిరించి, నిషేధిత జాబితాలో ఉన్నయని భయపెట్టి… బెదిరించి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో భూములు కొనేశారని ఫైర్ అయ్యారు. బ్లాక్ మెయిల్ చేసి అసైన్డ్ భూములు లాక్కుని…అయితే జీవనోపాధిని కొనసాగించాలని… అమ్ముకోవడానికి వీల్లేదని చిన్న క్లాజు పెట్టడం జరిగిందని… కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసైన్డ్ భూములపై దృష్టిపెట్టి వాటిని లాక్కోవడమే పనిగా పెట్టుకున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇందులో ప్రభుత్వ అధికారుల ముఖ్య పాత్ర ఉంది. ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే కేసీఆర్‌కి ఈ ఉద్యోగులే తగిన జవాబు చెబుతారన్నారు.