లిక్కర్ స్కాంలో అసలు కేసీఆరే – విజయశాంతి

లిక్కర్ స్కాంలో అసలు కేసీఆరే అని విజయ శాంతి ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం ఢిల్లీలో జరగడం వల్ల, అందులో తెలంగాణ నుండి కూడా వ్యక్తుల ప్రమేయం కీలకంగా దర్యాప్తు సంస్థల ద్వారా ఆరోపించబడుతున్నందున… ఆ సమస్య కొంచెం వార్తలపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నదని వెల్లడించారు.

ప్రస్తుతం, తెలంగాణలో అవినీతి సహజమైన ప్రక్రియగా మారిపోయింది. దుర్మార్గం, దోపిడీలు బీఆరెస్ ప్రభుత్వ నిత్య కార్యాచరణ అయిపోయింది. అసలు ఈ మొత్తం అవినీతికి నిజమైన బాస్, కరప్షన్‌కి వెనక ఉన్న దొంగ, నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే… వాస్తవాలు తప్పక బయటకి వస్తాయి. కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి బదులు చెప్పక తప్పదన్నారు విజయశాంతి.