ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోదు అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ లిక్కర్ కేసును వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అరెస్టులు మంచిది కాదన్నారు. కేసులు పెట్టి రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేజీవాల్ ని విచారణ కోసమే అరెస్టు చేశారని చెప్పారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పిల్లర్లు కుంగిన మాట వాస్తవమే.. కానీ, కేసీఆర్ చెప్పిందే చేశామని ఎల్అండ్ సంస్థ అనడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంజినీర్ కాదు.. కాకపోతే ఆయన ప్రో యాక్టీవ్ ఉంటారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు ఉందని భావిస్తే ప్రజలు సహించరు అని అన్నారు. తప్పు లేదు కాబట్టే తమను పూర్తిగా తిరస్కరించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు కట్టబెట్టారని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.