హైదరాబాద్​కు వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్

-

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నారు. సాంకేతిక రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకొనే ‘బైన్‌ క్యాపిటల్‌’కు చెందిన ‘వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌’ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హ్యూస్టన్‌ నగరంలో ‘వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌’ గ్లోబల్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌(సీహెచ్‌ఆర్‌ఓ) ఎరికా బోగర్‌ కింగ్​తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తమ సంస్థ సేవల కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని మంత్రితో భేటీ అనంతరం ఆమె ప్రకటించారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్‌ ఎకోసిస్టమ్‌ వృద్ధి చెందిన కారణంగానే తమ సేవల కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. మొదటి మూడేళ్లలో అయిదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. మొత్తంగా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ పేర్కొంది. సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ నిర్ణయంతో.. టెక్‌ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే అన్న సంగతి మరోసారి స్పష్టమైందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news