IPL 2023 : RCB ఘోర ఓటమి..కోహ్లీని అవమానిస్తూ నవీన్ ఉల్ హక్ పోస్ట్!

-

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో RCB ఓటమి పాలైంది. RCB నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని GT 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్(104*) సెంచరీతో అదరగొట్టగా, విజయశంకర్ 53 పరుగులతో రాణించారు. RCB ఓడిపోవడంతో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఈ సారైనా ఛాంపియన్ గా నిలవాలి అనుకున్న RCB నిరాశే ఎదురయింది. అయితే.. GT పై ఆర్సిబి ఓడిపోగానే లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ యాంకర్ నవ్వుతున్నట్లు ఉన్న వీడియోను ఇన్ స్టాలో స్టోరీగా పెట్టాడు నవీన్. అయితే ఇది ఆర్సిబిని, కోహ్లీని ఉద్దేశించే అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విరాట్, నవీన్ మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఆ తర్వాత విరాట్ అవుట్ అయినప్పు డల్ల నవీన్ ఇలాంటి పోస్టులు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news