ప్రీతి ఆత్మహత్య కేసులోని అన్ని అనుమానాలను తీరుస్తామని వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఈ కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం రిపోర్టులు రావాలి. టాక్స్ కాలజీ రిపోర్ట్ ద్వారా కేసు ఫైనల్ కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే అన్ని వాస్తవాలు తెలుస్తాయి. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని ప్రకటించారు.
అటు, ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టారు వైద్యులు. ప్రీతి బాడీలో ఎలాంటి విషవాయులు విష పదార్థాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు వైద్యులు. ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ లో వెల్లడించారు. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ ఇచ్చారు.