గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు… లోకల్ ఫేక్ సమ్మిట్ – నారా లోకేష్

-

ఏపీలో ఉద్యోగాలు నిల్….గంజాయి పుల్ అని నారా లోకేష్ విమర్శలు చేశారు. ఏపీకి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాము ..వాటిద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము..చిత్తూరు పాదయాత్రలో నేను పెట్టిన కంపెనీ దగ్గర సెల్ఫీ దిగి జగన్ కు ఛాలెంజ్ విసిరాను……ఇప్పటి దాకా వైసిపి నుండి సమాదానం లేదని ఆగ్రహించారు.


వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక వేత్తలు బై బై ఎపి అన్నారు…ఎపిలో అత్యధిక టాక్స్ పేయర్ అమరరాజా కంపెనీ ..వైసిపి తీరు వల్లా తెలంగాణా పోయిందని వివరించారు. వైసిపిది లోకల్ సమ్మిట్ … అంతర్జాతీయ సమ్మిట్ కాదు…లక్ష రూపాయలు వేల్యూ లేని కంపెనీ 76వేలకోట్లు పెట్టబడి ఎలా పెడుతుందని ఆగ్రహించారు.

వైజాగ్ లో జరిగింది ముమ్మాటికి ఒక ఫేక్ సమ్మిట్ ….దావోస్ లో చేసుకున్న ఒప్పందాలు వైజాగ్ లో చూపించారు …దీన్ని ఫేక్ సమిట్ అనకుండా ఉండాలా అని నిలదీశారు. ఇండోసోల్ అనే కంపెనీ పేరుతో 25 వేల ఎకరాలు ఇస్తున్నారు …అది జగన్ బినామీ కంపెనీ అని ఆగ్రహించారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు… లోకల్ ఫేక్ సమ్మిట్ అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news