తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. నేడు తెలంగాణ రాష్ట్రానికి ఉరుములు.. మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. ఈ నెల 22 వ తేదీన ఖమ్మంలోకి నైరుతి రుతుపవనాలు..ప్రవేశించినట్లు తెలిపింది.
ఈ 23వ తేదీన తెలంగాణలోని మరికొన్ని భాగాలకు రుతుపవనాలు.. విస్తరించినట్లు తెలిపింది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. రుతుపవనాల ప్రభావంతో నిన్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడినట్లు ఐఎండీ పేర్కొంది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఇటు హైదరాబాద్ కు ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.