వాషింగ్ పౌడర్ నిర్మా కేసీఆర్ కి సైతం పనిచేసినట్టు ఉంది – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై మరోసారి తరదైన శైలిలో విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాషింగ్ పౌడర్ నిర్మా కెసిఆర్ కి సైతం పనిచేసినట్టు ఉందన్నారు. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగిందని.. బీజేపీతో దోస్తీ బయటపడిందన్నారు. కారు – కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ మొఖంలో కనపడ్డదని ఎద్దేవా చేశారు షర్మిల.

నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదన్నారు. “బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండు. అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే బీజేపీ, బిఆర్ఎస్ రహస్య అజెండా.

నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇన్నాళ్లు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదే. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? పోస్ట్ పోల్ ఒప్పందమా..? కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్ దొర.. అసలు విషయం బయటపెట్టు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంటా..? కేసీఅర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా ? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? తక్షణం బీజేపీ నోరు విప్పాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news