యూపీ లో మిషన్ శక్తి: మహిళల కోసం పోలీస్ స్టేషన్ లో గ్లాస్‌ రూమ్‌ ఏర్పాటు

-

మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.ఇదే క్రమంలోని ఉత్తరప్రదేశ్‌లోని యోగీ సర్కారు కూడా మహిళల సంక్షేమం,భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా మిషన్‌ శక్తి ప్రోగ్రామ్‌ని తీసుకువచ్చింది ఆదిత్యనాథ్‌ సర్కారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మహిళల భద్రతపై పోలీసులను మరియు నివాసితులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో నిర్ణయం తీసుకున్నారు.

మహిళా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను మహిళా పోలీసు సిబ్బంది ముందు నమోదు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో గ్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో రహస్య గాజు గదిని ఏర్పాటు చేయడం వల్ల మహిళా ఫిర్యాదుదారులు మహిళా పోలీసు సిబ్బందితో స్వేచ్ఛగా మాట్లాడేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హెల్ప్ డెస్క్‌లో సిసిటివి మరియు కంప్యూటర్‌ను అమర్చి,పోలీసు సిబ్బంది ఫిర్యాదుదారు కోసం సీటింగ్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు దారునికి ఫిర్యాదు రాయడానికి స్టేషనరీ కూడా అందించాలని సిఎం చెప్పారు.

మహిళల పట్ల గౌరవం ప్రజల్లో పెంపొందించాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో మిషన్ శక్తి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు.పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మహిళలకు గౌరవం ఇచ్చేలా కృషి చేయాలని అన్నారు.

ఇప్పటికే మహిళలకు పోలీస్‌ స్టేషన్‌లలో లభిస్తున్న గౌరవం పట్ల ముఖ్యమంత్రి యోగి పోలీసులను ప్రశంసించిన ఆయన చీఫ్ సెక్రటరీ మరియు అధికారులు మిషన్ శక్తికి సంబంధించిన కార్యకలాపాలను సమీక్షించాలని సూచించారు. మహిళల పట్ల ప్రజల దృక్పథాన్ని మార్చే లక్ష్యంతో మిషన్ శక్తి పరిధిని విస్తృతం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంతో సామాన్య ప్రజల అనుబంధం పెరగాలని,ఈ దిశగా అధికారులు కృషి చేయాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news